(Local) Fri, 28 Feb, 2020

కారెం శివాజీ రాజీనామా -జగన్ సమక్షంలో..వైసీపీలోకి

November 29, 2019,   12:30 PM IST
Share on:
కారెం శివాజీ రాజీనామా -జగన్ సమక్షంలో..వైసీపీలోకి

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పదవికి కారెం శివాజీ నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే . ఈ రోజూ ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలతో మంతనాలు పూర్తయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కారేం శివాజీతో పాటు తొమ్మిది మందికి సీఎం అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టుగా సమాచారం. చంద్రబాబు హాయంలో కారెం శివాజీ ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ గా నియమితులయ్యారు. ఆయన నియామకం దగ్గర నుండి న్యాయపరమైన వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక దశలో న్యాయస్థానం ఆయన నియామకాన్ని తప్పు పట్టింది. ఆ తరువాత తిరిగి న్యాయ పరంగా పోరాటం కొనసాగిస్తూ.. ఆ పదవిలో ఆయన కొనసాగారు. ఇక, ఏపీలో ప్రభుత్వం మారి.. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన అదే పదవిలో కొనసాగారు. కాగా, గురువారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శికి వేరు వేరుగా లేఖలు రాశారు.

 

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.