(Local) Sun, 17 Nov, 2019

రోడ్డుపై వెండి ముద్దలు...ఏరుకోడానికి ఎగబడ్డ ప్రజలు

November 08, 2019,   8:11 PM IST
Share on:
రోడ్డుపై వెండి ముద్దలు...ఏరుకోడానికి ఎగబడ్డ ప్రజలు

బీహార్ సీతామఢి బాబా భీంరావ్‌ అంబేడ్కర్‌ టవర్‌ చౌక్‌ నుంచి సుర్శంద్‌లోని జవహర్‌లాల్‌ నెప్లూ కళాశాల వరకూ ఇటీవల తెల్లవారుజామున చిన్న చిన్న వెండి ముద్దలు చెల్లాచెదురుగా పడి ఉండడం కలకలం రేపుతోంది. ఈ సందర్భంగా బీహార్  సీతామఢిలోని సుర్సంద్‌లో  తెల్లారి లేచేసరికి రోడ్డుపై వెండి ముద్దలు  కనబడేసరికి  జనం ఎగబడి వాటిని ఏరుకున్నారు. స్మగ్గర్లు నేపాల్‌ నుంచి బంగారం, వెండి తదితర లోహాలను సుర్చ్శంద్‌ మీదుగా భారత్‌లోకి అక్రమంగా తీసుకొస్తుంటారు. తర్వాత వీటిని టోకు వ్యాపారులకు విక్రయిస్తారు. అలా తీసుకొచ్చే క్రమంలోనే ఈ వెండి ముద్దలు రోడ్డుపై పడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఏది ఏమైనా బీహార్ ప్రజల రొట్టె విరిగి నేతిలో పడ్డట్లయింది.

సంబంధిత వర్గం
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.