(Local) Wed, 03 Jun, 2020

విజయవంతమైన మూడో మోటర్ వెట్ రన్

May 15, 2019,   1:43 PM IST
Share on:
విజయవంతమైన మూడో మోటర్ వెట్ రన్

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం భూగర్భంలో నిర్మించిన పంప్‌హౌస్‌లోని మూడో మోటర్ వెట్ రన్ విజయవంతమైంది. మూడో పంపు వెట్ రన్‌ను నీటి పారుదల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్‌డీ శ్రీధర్ రావ్ దేశ్ పాండే, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు ప్రారంభించారు. వెట్ రన్ సక్సెస్‌తో అధికారుల్లో ఆనందం వెల్లివిరిసింది. మూడో వెట్ రన్ విజయవంతం కావడంతో సాయంత్రం నాలుగో మోటర్ వెట్ రన్‌ను అధికారులు ప్రారంభించనున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.