(Local) Wed, 16 Oct, 2019

ఈ నెల 10న ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న ఉపరాష్ట్రపతి

October 09, 2019,   3:04 PM IST
Share on:
ఈ నెల 10న ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న ఉపరాష్ట్రపతి

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్టోబర్ 10వ తేదీ నుంచి ఆఫ్రికా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 11న కామరోస్‌ దేశాధ్యక్షుడు అజాలీ అసౌమనితో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. 12 13,14 తేదీల్లో సియోర్రాలియోన్‌లో పర్యటిస్తారు. ఆ దేశాధ్యక్షుడు జూలియన్‌ మాదా బయో, విదేశాంగ మంత్రి నబవీలా ఫరీదా ట్యూనిస్‌తో వేర్వేరుగా సమావేశమవుతారు. ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. సియోర్రాలియోన్‌లో భారత సంతతి ప్రజలతో ఉపరాష్ట్రపతి సమావేశమవుతారు. 15న తిరిగి దిల్లీ చేరుకుంటారు. 

సంబంధిత వర్గం
ప్రపంచదేశాలు ఉగ్రవాదం పై పోరాడాలి  - వెంకయ్య నాయుడ ...
ప్రపంచదేశాలు ఉగ్రవాదం పై పోరాడాలి - వెంకయ్య నాయుడ ...
డీజీపీలకు ఖచ్చితమైన పదవీకాలం ఉండాలి: వెంకయ్యనాయుడు
డీజీపీలకు ఖచ్చితమైన పదవీకాలం ఉండాలి: వెంకయ్యనాయుడు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.