(Local) Sat, 24 Aug, 2019

బాలీవుడ్ గాయకుడి ట్విట్టర్ ఖాతా హ్యాక్

June 12, 2019,   12:48 PM IST
Share on:

సోష‌ల్ మీడియా ఎకౌంట్స్ హ్యాక్ కావ‌డం, అందులో వారికి సంబంధించిన ఫోటోలు కాకుండా వేరేవారికి సంబంధించిన స‌మాచారం ప్ర‌త్య‌క్షం కావ‌డం కొన్నాళ్ళుగా జరుగుతూ వ‌స్తుంది. ఆయితే ఎక్కువుగా ఇలా హాక్ అయ్యే అకౌంట్లు సెలబ్రిటీస్ కి సంబంధిచినవి ఆయితే ఆ విషయం ఇక చెప్పక్కర్లేదు. గత సంవత్సరం బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, మొన్న బాలీవుడ్ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, తాజాగా పాప్ సింగర్ అద్నాన్‌ సమీ ట్విట్టర్ అకౌంట్ హాక్ కూడా అయింది. కాగా బిగ్‌బీ, అద్నాన్‌ సమీ అకౌంట్లు హాక్ చేసింది ఒకలా ఉండటం గమనార్హం. ఈ రెండు సందర్భాల్లో కూడా హ్యాకర్లు పాకిస్థాన్ అనుకూల ట్వీట్లతో వారి ఖాతాలను ముంచెత్తారు. ప్రస్తుతం సమీ ట్విటర్ ప్రొఫైల్ పిక్చర్‌, ట్విటర్ బయోలను మార్చివేశారు. ప్రొఫైల్ పిక్చర్ స్థానంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోను ఉంచారు. అలాగే అద్నాన్‌ సమీ ప్రొఫైల్‌కు పాక్‌ అనుకూల ట్వీట్‌ను ట్యాగ్ చేశారు హ్యాకర్లు. ‘దాయాది దేశం పాకిస్థాన్‌ను విమర్శించే ప్రయత్నం చేస్తే పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌, పాకిస్థాన్ జాతీయ జెండాలు ప్రొఫైల్ పిక్చర్లుగా దర్శనమిస్తాయి’ అని హెచ్చరిక లాంటి ట్వీట్ చేశారు. అమితాబ్ బచ్చన్‌ ట్విటర్‌ను హ్యాక్ చేసి కూడా ఇలాంటి అర్థం వచ్చే ట్వీట్లే చేశారు. అయితే ఢిల్లీ ని  ఏలిన ఖిల్జీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ అనాగరిక ఆక్రమణదారుడు కాదని హ్యాకర్‌ ట్వీట్ చేశాడు. బాలీవుడ్‌లో విజయవంతమైన పద్మావత్‌లో ఇతని పాత్ర గురించి ఈ వర్ణన ఉంటుంది. అందులో ఖిల్జీ ఆక్రమించే రాజ్యం షాహిద్ కపూర్ పాలనలో ఉంటుంది. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.