(Local) Sat, 24 Aug, 2019

అసోంకు రూ.2 కోట్ల భారీ విరాళం ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో!

July 18, 2019,   2:05 PM IST
Share on:

బాలీవుడ్ అక్షయ కుమార్ అనగానే కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే కాదు ఆయన రియల్ హీరోయిజమ్ కూడా గుర్తుకు వస్తుంది.  అయితే గత కొన్నిరోజులుగా  అసోంపై వరుణుడు పగబట్టినట్టుగా ప్రతాపం చూపిస్తున్నాడు. దాని ఫలితమే కుండపోత వర్షాలు, ఊళ్లకు ఊళ్లనే మింగేస్తున్న భారీ వరదలు, బ్రహ్మపుత్ర వంటి నదులు పొంగిపొర్లుతుండడంతో దాదాపు 45 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 33 జిల్లాలు వరద బీభత్సంతో వణికిపోతున్నాయి. వీటన్నంటిని మించి వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కజిరంగ నేషనల్ పార్క్ 90 శాతం జలమయం అయింది. అందులోని లక్షలాది వన్యప్రాణుల పరిస్థితి ఏంటన్నది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో అసోంను చూసి చలించిపోయిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. వెంటనే అసోంకు రూ.2 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. అందులో కోటి రూపాయలు అసోం ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో కోటి రూపాయలు కజిరంగ నేషనల్ పార్క్ కు విరాళంగా అందించారు. అంతేగాకుండా, తాను సాయం చేశానని, మీరు కూడా సాయం చేయండి అంటూ అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.