(Local) Sat, 24 Aug, 2019

ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్‌ బ్యాట్‌ - అల్గోబ్యాట్

July 18, 2019,   2:51 PM IST
Share on:

కెనెడాలోని బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్‌ బ్యాట్‌ తయారు చేసేందుకు శ్రీకారం చుట్టారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో, మ్యాథమెటికల్‌ అల్గారిథమ్స్‌ ఉపయోగించి ఓ సరికొత్త బ్యాట్‌ని రూపొందించారు. దాని పేరు అల్గో బ్యాట్‌.అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి బ్యాట్‌ ఖరీదు లక్షల్లో ఉండగా.. తమ ఆల్గోబ్యాట్‌ ఖరీదు రెండు మూడు వేల కంటే ఎక్కువ ఉండదని ఈ బ్యాట్‌ని రూపొందించిన ఫిల్‌ ఎవన్స్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. ప్రస్తుతం ఈ బ్యాట్ ప్రయోగ దశలోనే ఉందని, త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నట్లు తెలిపారు.

బ్యాట్‌ జామెట్రీని మార్చడం ద్వారా బంతి తగిలినప్పుడు అతితక్కువగా  కంపించడం, తక్కువ శక్తితోనే ఎక్కువ దూరం వెళ్లడం ఈ ఆల్గోబ్యాట్‌ ప్రత్యేకతలని ఆయన తెలిపారు. ఆల్గోబ్యాట్‌ డిజైన్‌ సాధారణ కలపతోనూ అత్యుత్తమమైన బ్యాట్‌లు తయారు చేయొచ్చని, ఆయా కలప రకానికి తగ్గట్లు డిజైన్‌ మార్చుకునే అవకాశం ఉంటుందని అన్నారు.అల్గోబ్యాట్‌ వెనుక భాగం ఆకారం అద్భుతం. అది కంపనాన్ని తగ్గిస్తుంది. బ్యాట్స్‌మన్‌ పూర్తి శక్తి షాట్లోకి వెళ్తుంది" అని అల్గోబ్యాట్‌ రూపొందించిన వారిలో ఒకరైన మజ్లూమీ చెప్పాడు. 

 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.