(Local) Mon, 20 Jan, 2020

ముగ్గురు కామ్రేడ్‌లు ఆలపించిన “డియర్ కామ్రేడ్” ఆంథెమ్!

July 18, 2019,   6:44 PM IST
Share on:
ముగ్గురు కామ్రేడ్‌లు ఆలపించిన “డియర్ కామ్రేడ్” ఆంథ ...

విజయ దేవరకొండ, రష్మిక మందాన మరోసారి జంటగా నటిస్తున్న 'డియర్ కామ్రేడ్' ఈ నెల జులై 26న విడుదల కానున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు. విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించి బెంగుళూరు లో మ్యూజిక్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు.

ఈ  సినిమా నుండి కామ్రేడ్ ఆంథెమ్ టీజర్ ను విడుదల చేశారు. ఈ కామ్రేడ్ ఆంథెమ్ పాటను జూలై 18 వ తేదీ గురువారం ఉదయం 11:11 గం.లకు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ విడుదలలో కాస్త జాప్యం జరగడంతో ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. ఈ కామ్రేడ్ ఆంథెమ్ ప్రత్యేకత ఏంటంటే తెలుగులో ఈ పాటను విజయ్ దేవరకొండ ఆలాపించగా. తమిళంలో విజయ్ సేతుపతి.. మలయాళంలో దుల్కర్ సల్మాన్ ఆలపించారు. ఇలా మూడు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు స్టార్లు ఇలా కామ్రేడ్ ఆంథెమ్ లో భాగం కావడం అందరినీ ఆకర్షిస్తోంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో సౌత్ మార్కెట్ అంతా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్ లాంటి క్రేజీ హీరోలు ఇలా కామ్రేడ్ కోసం గొంతు సవరించడం అనేది విజయ్ అభిమానులకు ఫుల్ జోష్ ను ఇస్తోంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.