(Local) Sun, 23 Feb, 2020

ఆటోలకు జగన్ స్టిక్కర్ల పై కన్నా లక్ష్మీ నారాయణ ఫైర్..

October 09, 2019,   6:30 PM IST
Share on:
ఆటోలకు జగన్ స్టిక్కర్ల పై కన్నా లక్ష్మీ నారాయణ ఫైర ...

ఆటోల పై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేయడం పై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ఫైర్ అయ్యారు. పోలీసులను సొంత పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో చంద్రబాబుకు మీకు తేడా ఏముంది జగన్ అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చంద్రబాబు స్టిక్కర్ వేశారు. మీరు అంతకు మించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మీకు ఓటు వేసినందుకు కార్మికులకు పని దొరక్క రోడ్డుపై పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆఫీస్ లకు మీ పార్టీ రంగులేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. 

సంబంధిత వర్గం
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.