(Local) Wed, 16 Oct, 2019

కొత్త ప్రతిపాదన తో మందు బాబులకు మరో షాక్...

October 09, 2019,   6:18 PM IST
Share on:
కొత్త ప్రతిపాదన తో మందు బాబులకు మరో షాక్...

ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు వైసీపీ సర్కార్ మరో షాక్ ఇవ్వబోతుంది. వైన్ షాపుల సంఖ్యను తగ్గించి, పరిమిత సంఖ్యలో నడుపుతున్న ప్రభుత్వం, వ్యక్తిగత నిల్వ, కొనుగోళ్ల కెపాసిటిని కూడా కుందించింది. దీంతో పాటు గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను సైతం మూయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం మందుబాబు లకు షాక్ గట్టి ఇచ్చేలా ఉంది. వైన్ షాప్ ల టైంను తగ్గించినట్టే బార్ల సంఖ్య, సమయాన్ని కూడా తగ్గించాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఉదయం 10గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ప్రస్తుతం బార్లు నడుస్తున్నాయి. ఇప్పుడు బార్ల సమయాన్ని కూడా తగ్గిస్తే మద్యపాన నిషేధంపై మరో అడుగు ముందుకు పడినట్లు ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

బార్ల సమయాన్ని ఎంతసేపు కుదించాలన్న దానిపై ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. దసరా తర్వాత నిర్ణయాన్ని అమలు చేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి 10గంటల వరకే బార్లు మొత్తం క్లోజ్ అయ్యేలా చేస్తే పనిభారం తగ్గడంతో పాటు, గస్తీ చేపట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుందోని ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేస్తుంది.

ఇప్పటికే రెండు మూడు రకాల టైమ్ స్లాట్ లను నిర్ణయించిన అధికారులు సాధ్యసాధ్యాలు, లాభ నష్టాల విషయంపై ఓ రిపోర్టు తయారు చేసి సీఎం జగన్ తో చర్చించాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం అనంతరం వెంటనే జీవో జారీ చేసి మద్యపాన నిషేధం దిశగా మరో మెట్టు పైకి ఎక్కాలని చూస్తున్నారు.

సంబంధిత వర్గం
సాయంత్రంలోపు బోటు వెలికి తీస్తాం
సాయంత్రంలోపు బోటు వెలికి తీస్తాం
డయల్‌ యువర్‌ సీఈవో...ఆరోగ్యశ్రీ
డయల్‌ యువర్‌ సీఈవో...ఆరోగ్యశ్రీ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.