(Local) Sat, 24 Aug, 2019

ఉత్కంఠ రేకెత్తించేలా ‘రాక్షసుడు’ ట్రైలర్!

July 18, 2019,   7:45 PM IST
Share on:

త‌మిళంలో సూప‌ర్‌ డూప‌ర్‌ హిట్ అయిన 'రాచ్చసన్' అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి ‘రాక్షసుడు’ గా  తెరెకెక్కుతున్న విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. స్కూల్ కి వెళ్లే టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసే వారి ప్రాణాలు తీసే సైకో కిల్లర్ కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

ట్రైలర్ లో ఈ విధంగా.. ‘నేనంటే భయానికే భయం.. నా గురించి వెతకొద్దు’ అంటూ ఓ సీరియల్‌ కిల్లర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయిన బెల్లకొండ శ్రీనివాస్‌కు వార్నింగ్‌ ఇస్తున్న డైలాగ్‌లో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగింది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు నెలకోల్పింది. ఏ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ సమాయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం జిబ్రాన్ అందిస్తున్నారు. ఆగస్టు 2న ఈ మూవీని విడుదల చేయనున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.