(Local) Fri, 23 Aug, 2019

శ్రీదేవి జ‌యంతి.. జ్ఞాప‌కాల‌లో భర్త,కూతురు

August 13, 2019,   3:49 PM IST
Share on:

'సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ' ఈ పాట గుర్తుండని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ పాట అప్పట్లో ఒక సంచలనమే సృష్టించింది. అంతేకాక ఈ పాటలో నటించిన నటి శ్రీదేవి తన అందంతో అభినయంతో ఎందరి మదిలోకో చొచ్చుకుపోయింది. అలాంటి అందాల చందమామ ఈ లోకాన్ని వీడి ఏడాది పూర్తైంది. బోనికపూర్ సోదరి రీనా కుమారుడు పెళ్ళిక‌ని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్ర‌వ‌రి 24, 2018న బాత్ ట‌బ్‌లో మునిగి క‌న్ను మూసినా సంగతి విదితమే. ఆమె మ‌ర‌ణం ఇప్ప‌టికి క‌ల‌గానే ఉంది. శ్రీదేవి ఫ్యామిలీ ఇప్ప‌టికి ఆమె జ్ఞాపకాల‌లోనే బ‌తుకుతున్నారు. ముఖ్యంగా శ్రీదేవి త‌న‌య జాన్వీ త‌న త‌ల్లితో ఉన్న అనుబంధాన్ని ఏదో ఒక సంద‌ర్భంగా గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఈ రోజు శ్రీదేవి జ‌యంతి సంద‌ర్భంగా తిరుప‌తి వెళ్ళి ఆమె పేరుపై అభిషేకం చేయించిన‌ట్టు స‌మాచారం. అభిమానులు కూడా శ్రీదేవి పేరుతో ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఎన్నో హిట్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన శ్రీదేవి భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయిన సినిమాల‌తో ఎప్ప‌టికి అల‌రిస్తూనే ఉంటుంది. జ‌యంతి సంద‌ర్భంగా ఆమెకి మ‌నం నివాళుల‌ర్పిద్ధాం.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.