(Local) Sat, 24 Aug, 2019

కొత్త నిబంధనను ప్రవేశపెట్టనున్న ఐసీసీ

July 18, 2019,   2:57 PM IST
Share on:

ఈ వారంలో లండన్‌ వేదికగా జరగనున్న క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వార్షిక సభ్య సమావేశంలో ఆటగాడి  సబ్‌స్టిట్యూట్‌కు గ్రీన్ సిగ్నల్ విషయమై  కీలక నిర్ణయం తీసుకోనున్నారు.2014లో ఫిలిప్ హ్యూస్ మరణాంతరం ఐసీసీ ముందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. 2017 నుంచీ ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌ టోర్నీలతో పాటు బీబీసీ 2016-17 సీజన్‌లో సైతం సబ్‌స్టిట్యూట్‌ఆటగాళ్లు బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేసేందుకు ప్రయోగాత్మక పద్ధతిలో ఐసీసీ అనుమతి ఇచ్చింది.

ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'టెస్టు చాంపియన్‌ షిప్‌'లో సైతం ఈ విధానాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా ఆగస్టు 1 నుంచి జరిగే యాషెస్‌ సిరీస్‌లో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ను అమలు చేయాలని భావిస్తోంది. దీనికోసం రూపొందించాల్సిన నియమ నిబంధనలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.ఈ మధ్య కాలంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌‌కు సంబంధించి నియమ నిబంధనలను రూపొందించాలంటూ చాలా మంది తమ గొంతుకను వినిపించారు. క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పిన దాని ప్రకారం డాక్టర్ అనుమతితోనే ఆటగాడు మైదానాన్ని వీడాల్సి ఉంటుంది. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో సైతం ఐసీసీ దీనిపై క్రికెటర్లకు అవగాహన కల్పించింది.

మైదానంలో ఆటగాడి తలను బంతి బలంగా తాకితే దిమ్మ తిరుగుతుంది. దీంతో కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాదు. దీనినే కాంకషన్‌ అంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడికి కేవలం ఫీల్డింగ్‌ చేసేందుకు అనుమతి ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసేందుకు ఐసీసీ నిబంధనలు ఒప్పుకోవడం లేదు.అయితే కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ప్రకారం మరొక ఆటగాడిని జట్టులోకి అనుమతినిస్తారు. దీంతో ఆ ఆటగాడు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ వేసిన బంతి దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా తలకు బలంగా తగలడంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అదే కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అమల్లో ఉండే అతడి స్థానంలో మరొక ఆటగాడు క్రీజులోకి వచ్చేవాడు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.