(Local) Thu, 18 Jul, 2019

చిరుకు జోడీగా ఐశ్వర్యరాయ్.. చరణ్‌ను ఒప్పించిన బడా డైరెక్టర్..

July 11, 2019,   11:08 PM IST
Share on:

చిరు ‘సైరా' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, అంతకంటే ముందు అంటే చిరు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభం కానుందని తెలిసింది.చిరు సరసన ఐష్ మెగాస్టార్‌తో అవకాశం రావడంతో కొరటాల శివ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ముఖ్యంగా చిరు సరసన నటించే హీరోయిన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని టాక్. ఈ సినిమా కోసం మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ను సంప్రదించబోతున్నట్లు సమాచారం.రామ్ చరణ్‌ను ఒప్పించాడట ప్రతిష్టాత్మక చేస్తున్న సినిమా కావడంతో ఐశ్వర్యరాయ్‌ను తీసుకునే విషయంలో నిర్మాత రామ్ చరణ్‌ను ఒప్పించాడట కొరటాల శివ. ఈ మేరకు చరణ్ నుంచి హామీ తీసుకున్న ఈ బడా డైరెక్టర్ త్వరలోనే ఐష్‌ను కలిసి, స్క్రిప్ట్ వినిపించబోతున్నాడని ఫిలింనగర్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.