(Local) Sat, 24 Aug, 2019

కరకట్ట అక్రమ కట్టడాలపై అసీంబ్లీ లో చర్చ

July 18, 2019,   1:41 PM IST
Share on:

ఏపి అసెంబ్లీలో సిఎం జగన్‌ కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలపై  చర్చ జరిగింది . రివర్‌ కన్జర్వేటివ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఇచ్చిన నోటీసును అసెంబ్లీలోని టీవీ స్క్రీన్‌పై సిఎం జగన్‌ చూపిస్తూ దాని గురించి వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రే అలా చేయడంతో మిగిలిన వాళ్లు కూడా అక్రమ కట్టడాలు నిర్మించారని, నదీ పరివాహక ప్రాంతంలో అలా చేస్తే వరదలు సంభవించే ప్రమాదం ఉందని సీఎం జగన్ చెప్పారు. అందుకే నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన కట్టడాలను కూల్చివేయడం జరుగుతోందని వివరించారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.