(Local) Sat, 24 Aug, 2019

ముసలివాడిగా మారిన వెన్నెల కిషోర్

July 18, 2019,   1:47 PM IST
Share on:

ఇటీవల కొత్తగా వస్తున్న అనేక యాప్ లు సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తున్నాయి. మన ఫోటోను అప్ లోడ్ చేస్తే.. ఏ వయస్సులో ఎలా ఉంటామో చూపించే యాప్ లు ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. అయితే ఈ యాప్ ద్వారా సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీస్ కూడా తమ ఫొటోస్ తీసుకుని వృద్దాప్యం లుక్ లో తాము ఎలా ఉంటారో అని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో  బాలీవుడ్ నటులే కాకుండా టీమిండియా క్రికెటర్స్ కూడా తమ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులని ఆకట్టుకుంటున్నారు. అదే కోవలో తాజాగా టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ తనకు సంబంధించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో వెన్నెల కిషోర్ ముసలివాడిగా కన్పిస్తున్నాడు. ఇంస్టాగ్రామ్ లో  వెన్నెల కిషోర్ ఫొటోకు మంచి స్పందన లభిస్తోంది.  అయన ఎలా కన్పించినా కామెడీకి మాత్రం ఏం తక్కువ ఉండదని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ కామెడీ చేస్తున్నావంటూ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు కామెంట్స్ పెడుతున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.