(Local) Fri, 06 Dec, 2019

ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు

November 30, 2019,   1:11 PM IST
Share on:
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు

 టిడిపి అధినేత చంద్రబాబు రాజధాని పర్యటనలో ఆయన  కాన్వాయ్ పై జరిగిన దాడి పై , ఏపి డీజీపి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో టిడిపి నేతలు చర్చించారు. ఈ సంఘటనపై తూళ్లూరు పిఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లు విసిరిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు కాన్వాయ్ వద్ద నిరసనలకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాగా రాజధాని రైతులు రెండు వర్గాలుగా విడిపోయి వైఎస్‌ఆర్‌సిపి వర్సెస్‌ టిడిపి అన్నట్లుగా వ్యవహరించారు. అంతేకాకుండా కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లతో దాడికి దిగిన విషయం తెలిసిందే.

సంబంధిత వర్గం
కారెం శివాజీ రాజీనామా -జగన్ సమక్షంలో..వైసీపీలోకి
కారెం శివాజీ రాజీనామా -జగన్ సమక్షంలో..వైసీపీలోకి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.