(Local) Sat, 24 Aug, 2019

పుల్వామా ఉగ్ర దాడి :సిఆర్ పిఎఫ్ జవాన్లకు కోటి రూపాయలు

July 18, 2019,   2:42 PM IST
Share on:

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిలో దాదాపు 40 మంది సిఆర్ పిఎఫ్ జవాన్లు చనిపోయిన సంగతి తెలిసిన విషయమే. మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు నష్టపరిహరం కింద ఒక్కొక్కరికీ సూమారు కోటి రూపాయలు ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ… కేంద్ర ప్ర‌భుత్వ ఎక్స్‌గ్రేషియాగా 35 ల‌క్ష‌లు, డ్యూటీ స్టేట్ నుంచి 5 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా, సిఆర్‌పిఎఫ్ రిస్క్ ఫండ్ నుంచి 20 ల‌క్ష‌లు, సిఆర్‌పిఎఫ్ సెంట్ర‌ల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి 1.5 ల‌క్ష‌లు, ఎస్ బిఐ పారామిలిట‌రీ సాల‌రీ ప్యాకేజ్ నుంచి 30 ల‌క్ష‌లు ఇచ్చిన‌ట్లు తెలియజేశారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.