(Local) Mon, 16 Sep, 2019

"ఆవిరి" ఫ‌స్ట్ లుక్ పోస్టర్.....

September 11, 2019,   1:27 PM IST
Views: 31
Share on:

1998లో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన మావిడాకులు చిత్రం ద్వారా ముద్దు కృష్ణ పాత్రలో తెలుగు తెరకి పరిచయమైనా నటుడు రవిబాబు. ఆ తర్వాత పలు చిత్రాలలో విల్లన్ గా, కమెడియన్ గా నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా 2002 లో సినిమాల్లో నటిస్తూనే డైరెక్టర్ గా మారి ఇ.వి.వి.సత్యనారాయణ తనయుడైన హీరో అల్లరి నరేష్ తో "అల్లరి" చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ తర్వాత నటుడిగా, ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా మారి విభిన్న క‌థా చిత్రాల‌ని తెర‌కెక్కిస్తూ త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ర‌విబాబు 2018లో పందిపిల్ల ప్ర‌ధాన పాత్ర‌లో అదుగో అనే సినిమాని రూపొందించాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత ఆద‌ర‌ణ పొంద‌లేదు.

తాజాగా ఫ్లైయింగ్ ఫ్రాగ్స్‌ బ్యానర్‌పై ఆవిరి అనే సినిమా నిర్మిస్తున్నాడు. ఇందులో ర‌విబాబు, నేహా చౌహ‌న్, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్, ముక్త‌ర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. స‌క్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు త‌న సొంత బేన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్ మీదుగా చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఈ లుక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. స్ట‌వ్‌పై ఉన్న కుక్క‌ర్ మ‌ధ్య‌లో నుండి నేహా చూస్తున్న‌ట్టుగా ఫ‌స్ట్ లుక్ డిజైన్ చేశారు. ఈ చిత్రంతోనైన ర‌విబాబు మంచి విజ‌యం సాధిస్తాడా అనేది చూడాలి. 

సంబంధిత వర్గం
సూపర్ స్టార్ తో మిల్కీ బ్యూటీ.....
సూపర్ స్టార్ తో మిల్కీ బ్యూటీ.....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.