(Local) Fri, 15 Nov, 2019

‘వెంకీ మామ’ టైటిల్ సాంగ్ రిలీజ్...

November 08, 2019,   3:23 PM IST
Share on:
‘వెంకీ మామ’ టైటిల్ సాంగ్ రిలీజ్...

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం  ‘వెంకీ మామ’. ఈ చిత్రంలో రియల్ లైఫ్ మామ అల్లుడు రీల్ లైఫ్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్, చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ పోస్టర్ మరియు ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించాయి.

తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ గా ‘వెంకీ మామ’ అంటూ సాగె టైటిల్ ట్రాక్ ని  రిలీజ్ చేసింది సినిమా యూనిట్. తన మామయ్య గురించి మేనల్లుడు ఎంతో గొప్పగా చెప్తూ మాస్ స్టైల్ బీట్ తో సాగిన ఈ సాంగ్ కి థమన్ అందించిన మ్యూజిక్ పెద్ద అసెట్. ఈ సాంగ్ ను సింగర్ శ్రీకృష్ణ ఆలపించగా, ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించడం జరిగింది. ఈ లిరికల్ వీడియోని బట్టిచూస్తే పల్లెటూరి వాతావరణంలో మామ, అల్లుళ్లయిన వెంకటేష్, చైత్యన్యల మధ్య ఈ సాంగ్ ని ఎంతో గ్రాండ్ గా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.  ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని అతి త్వరలో ఖరారు చేయనున్నారు.

సంబంధిత వర్గం
‘సోలో బ్రతుకే సో బెటర్' ఫస్ట్ లుక్...
‘సోలో బ్రతుకే సో బెటర్' ఫస్ట్ లుక్...
ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన...మామ అల్లుడు
ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన...మామ అల్లుడు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.