(Local) Tue, 07 Jul, 2020

ఇంగ్లండ్‌లో భారీ వర్షాలు - కివీస్‌, భారత్‌ మ్యాచ్‌ డౌట్ ?

June 12, 2019,   12:18 PM IST
Share on:
ఇంగ్లండ్‌లో  భారీ వర్షాలు - కివీస్‌, భారత్‌ మ్యాచ్ ...

ఇంగ్లండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ ప్రభావం ప్రపంచక్‌పపై తీవ్రంగా పడుతోంది.కొన్ని ప్రాంతాల్లోనైతే రెండు నెలల సగటు వర్షపాతం ఒక్క రోజులోనే నమోదవుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.దీంతో ఇప్పటికే ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి.ఈనేపథ్యంలో ప్రపంచక్‌పలో పది జట్లు కాదు.. 11వ జట్టుగా వరుణదేవుడు కూడా జాయిన్‌ అయ్యాడంటూ నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి.అంతేకాకుండా పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌తో సమానంగా వర్షానికి కూడా ఆరు పాయింట్లు ఇవ్వడం ఆకట్టుకుంటోంది.ఇక ఇంగ్లండ్‌ భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే 31 వరద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే కొన్ని కౌంటీల్లో 60మి.మీ వ ర్షం కురిసింది.అటు రైళ్ల సర్వీసులు కూడా రద్దు కావడమో.. ఆలస్యంగా నడవడమో జరుగుతోంది.ఇక భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ జరిగే గురువారం నాడు నాటింగ్‌హామ్‌లో వరద హెచ్చరికలు జారీ అయ్యాయి.దీంతో ఈ మ్యాచ్‌ కూడా టాస్‌ వేయకుండానే రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇదే జరిగితే కోట్లాది అభిమానులకు తీవ్ర నిరాశ తప్పదు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.