(Local) Mon, 09 Dec, 2019

ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి

November 30, 2019,   3:27 PM IST
Share on:
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి

ప్రియాంకరెడ్డి మర్డర్ కేసులో A4  చింతకుంట చెన్నకేశవులు (20). ఇతని తల్లి జయమ్మ మాట్లాడుతూ ...మహ్మద్‌ ఆరిఫ్తో స్నేహం చేసిన తర్వాతే నా కొడుకు పాడైపోయాడు. లారీ లోడ్‌ చేయాలని వాడే నా కొడుకును తీసుకుపోయిండు. ఇప్పుడు ఊరంతా మా గురించే మాట్లాడుతున్నారు.అయితే అందరికీ ఒకటే బాధ. తన కొడుకు ఇలాంటి పని చేశాడని తెలిసి నా భర్త ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు తెల్లవారుజామున రెండు గంటలకు నా కొడుకును తీసుకుపోయారు. ప్రియాంకను ఎలా చంపారో నా కొడుకును అలా చంపినా ఫర్వాలేదు. ఉరి వేయండి లేదా కాల్చి చంపుర్రి. ఇప్పుడు నా కొడుకును ఏం చేయొద్దంటే ఎవరూ వినరు. నా కొడుకు ఇట్లా చేస్తాడనుకోలేదు.లవ్‌ మ్యారేజీ చేసుకున్నప్పటికీ ఏం అనలేదు. అయ్యిందేదో అయ్యిందనుకున్నాం. నేను మాత్రమే తొమ్మిది నెలలు మోసి కొడుకును కనలేదు కదా. ఆ అమ్మాయి తల్లిది కూడా కడుపుకోతే. అందరిదీ అదే బాధ ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును కూడా అలాగే చంపినా ఫర్వాలేదు. నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు….ఇదీ ఆ తల్లి చెప్పిన తీర్పు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.