(Local) Fri, 24 Jan, 2020

ప్రతిభవనం చారిత్రత్మాకమైతే అభివృద్దికి చోటుండదు -కేసీఆర్

July 18, 2019,   1:07 PM IST
Share on:
ప్రతిభవనం చారిత్రత్మాకమైతే అభివృద్దికి  చోటుండదు - ...

ఈ రోజు జరుగుతున్న  తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో సియం కేసిఆర్‌ ప్రసంగిస్తూ.. ప్రతి భవనాన్ని చారిత్రక భవనమే అంటూ కొందరు వితండవాదం చేస్తున్నారని, ప్రతిభవనం చారిత్రక భవనమే ఐతే, అభివృద్దికి చోటుండదని అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక వారసత్వ భవనమని, ఇప్పుడున్న స్థలంలోనే కొత్త ఆసుపత్రిని నిర్మించాలని కొందరు కోరుతున్నారన్నారు. కొన్ని నిబంధనల వల్ల పురాతన భవనాలను కూల్చివేయడం సాధ్యం కాదని కేసిఆర్‌ అన్నారు. అలాగే రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్యను 142కు పెంచామని, ఐదు వేల పరిపాలన విభాగాలు ఏర్పాటు చేయడమే కాక సాహసోపేతమైన అనేక నిర్ణయాలు తీసుకున్నామని సియం అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులు తీసువచ్చామన్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.