(Local) Sat, 24 Aug, 2019

యాట్యూబ్ లో సెలెబ్రటీస్ కూతుళ్ళ హంగామా!

July 18, 2019,   1:08 PM IST
Share on:

సెలెబ్రటీస్ మాత్రమే ఎప్పుడు సందడి చేయాలా మేము కూడా చేస్తాము అంటూ ఇద్దరూ చిన్నారులు యూట్యూబ్ వేదికగా ముందుకు వచ్చారు. వారు ఎవరో కాదు... టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూతురు సితార‌, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కూతురు ఆద్య‌. అయితే ఇప్పుడు ఈ చిన్నారి సెలెబ్రిటీస్ కూడా యాట్యూబ్ వేదిక‌గా 3 మార్క‌ర్ ఛాలెంజ్ అంటూ సందడి చేస్తున్నారు. సితార‌, ఆద్య‌లు చేస్తున్న సంద‌డి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. కాగా వారిద్ద‌రు క‌ల‌సి సంద‌డి చేసిన యూ ట్యూబ్ వీడియోని మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేస్తూ..ఆ పిల్ల‌లిద్ద‌రికి బెస్ట్ విషెస్ అందించారు. అంతేకాదు యూ ట్యూబ్ వేదిక‌గా వారు చేసిన ఫ‌ర్‌ఫార్మెన్స్‌ని ఎంజాయ్ చేయండని కూడా పేర్కొన్నాడు. గ‌తంలో ఆద్య‌, సితార .. మ‌హ‌ర్షి చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో దేవి శ్రీ ప్రసాద్‌తో క‌లిసి సందడి చేశారు. అప్పుడు వీరి హంగామాకి నెటిజ‌న్స్ ఫిదా అయ్యారు. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.