(Local) Mon, 09 Dec, 2019

ఫోర్బ్స్‌ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ

November 30, 2019,   1:23 PM IST
Share on:
ఫోర్బ్స్‌ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ

 రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేష్‌ అంబానీ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘ద రియల్‌టైమ్‌ బిలియనీర్స్‌ జాబిత్ఞా లో ఆయన టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో ఆమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్‌ బెజోస్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 2019 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్‌ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ 13వ స్థానంలో నిలిచారు. నిన్న సాయంత్రం 5 గంటలకు ముగిసిన ట్రేండింగ్‌ అనంతరం తీసిన లెక్కల ప్రకారం..ఈ జాబితాలో 60 బిలియన్‌ డాలర్లు సంపదతో ముకేశ్‌ అంబానీ తొమ్మిదో స్థానంలో నిలిచారు. గురువారం నాటి ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ మార్కెట్‌ విలువ మొత్తం రూ.10లక్షల కోట్లు దాటిన నేపథ్యంలో ముకేశ్‌ టాప్‌-10 జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం.

సంబంధిత వర్గం
10 లక్షల కోట్ల తొలి ఇండియన్ కంపెనీ... రిలయన్స్
10 లక్షల కోట్ల తొలి ఇండియన్ కంపెనీ... రిలయన్స్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.