(Local) Sun, 29 Nov, 2020

భారత కుబేరుల జాబితాలో అగ్రస్థానం కైవసం చేసుకున్న ముఖేశ్ అంబానీ

October 11, 2019,   4:41 PM IST
Share on:
భారత కుబేరుల జాబితాలో అగ్రస్థానం కైవసం చేసుకున్న   ...

ఫోర్బ్స్ మ్యాగజైన్ భారత కుబేరుల జాబితా వెలువరించింది. ఈ జాబితాలో ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలుచున్నారు . రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలుచోవడం ఇది వరుసగా 12వ సారి. తద్వారా ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తున్న తీరు విశదమవుతోంది. ముఖేశ్ తర్వాత రెండోస్థానంలో అదానీ పోర్ట్స్ యజమాని గౌతమ్ అదానీ నిలిచారు. ముఖేశ్ సంపద విలువను 51.4 బిలియన్ డాలర్లుగా పేర్కొన్న ఫోర్బ్స్, రెండోస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఆదాయాన్ని 15.7 బిలియన్ డాలర్లుగా చూపింది.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కిందటేడాది రెండోస్థానంలో ఉన్న విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ ఈసారి 17వ స్థానానికి జారిపోయారు. అందుకు కారణం, ఆయన తన సంపదలో చాలాభాగం దాతృత్వ సేవలకు విరాళంగా ఇవ్వడమే. ఇక ఫోర్బ్స్ జాబితాలో అశోక్ లేలాండ్ అధినేతలు హిందూజా బ్రదర్స్ మూడో స్థానంలో, పల్లోంజీ గ్రూప్ యజమాని పల్లోంజీ మిస్త్రీ నాలుగో స్థానంలో, కోటక్ మహీంద్రా బ్యాంక్ అధినేత ఉదయ్ కోటక్ ఐదో స్థానంలో ఉన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.