(Local) Thu, 28 May, 2020

రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా ఆద్వర్యంలో ఘనంగా భారత ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకలు

September 17, 2019,   4:51 PM IST
Share on:
రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా ఆద్వర్యంలో ఘన ...

భారత ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం  రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్  కోలా  ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాలి గోపురం   వద్ద  మోదీ జన్మదినం సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్  కోలా    కేక్ కట్ చేశారు. బీజేపి నాయకులు కార్యకర్తలు  ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.
బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్  కోలా    ఈసందర్భంగా  మాట్లాడుతూసాధారణ వ్యక్తి నుంచి అసాధారణ, అసమాన్య శక్తిగా మారి ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని అగ్రపథంలో నిలబెట్టి, వ్యక్తి అని నరేంద్రమోదీ హయాంలో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. దేశానికి స్వచ్చమైన, అవినీతి రహిత పాలనను అందిస్తున్నారన్నరు. పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. పేదరికాన్ని రూపుమాపేందుకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.