(Local) Mon, 17 Jun, 2019

లేడీ సూపర్‌స్టార్‌కి సినిమాకి షాక్ ఇచ్చిన మద్రాసు హైకోర్టులో

June 12, 2019,   11:58 AM IST
Share on:

అందాల తార నయనతార నటించిన తమిళ చిత్రం “కోలైయుతీర్ కలాం” చిక్కులో పడింది. థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి  చక్రి తోలేటి దర్శకత్వం వహించగా ఈ సినిమాలో భూమిక కీలక పాత్ర పోషించారు. తమిళ రచయిత అయినా సుజాతా రంగరాజన్ నవల “కోలైయుతీర్ కలాం” ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్టు సమాచారం. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించగా ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుండగా ఊహించని విధంగా ఈ నవల హక్కుల్ని రూ.10 లక్షలు ఇచ్చి సుజాతా రంగరాజన్‌ భార్య నుంచి కొనుగోలు చేశానని దర్శకుడు బాలాజీ కుమార్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది కాపీ రైట్స్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని కాబట్టి నిర్మాతలు సినిమా విడుదల చేయకుండా చర్యలు తీసుకోవాలని బాలాజీ పిటిషన్‌లో కోరారు. మంగళవారం బాలాజీ పిటిషన్‌ను పరిశీలించిన హై కోర్టు సినిమా విడుదలపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 21న చిత్ర నిర్మాతలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వుల నేపథ్యంలో ఈ చిత్రం వాయిదా పడింది.
 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.