(Local) Mon, 06 Jul, 2020

సిద్ధిపేట,సిరిసిల్ల జిల్లాలకు నూతన కలెక్టర్లు

June 12, 2019,   12:33 PM IST
Share on:
సిద్ధిపేట,సిరిసిల్ల జిల్లాలకు నూతన కలెక్టర్లు

సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌గా పి.వెంకట్రామిరెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌ ఆఫీసులో వేదపండితుల ఆశీర్వచనం తీసుకుని ఆయన పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. సిద్ధిపేట జిల్లాకు వెంకట్రామిరెడ్డిని, రాజన్న సిరిసిల్ల జిల్లాకు కృష్ణ భాస్కర్‌ను కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా కృష్ణభాస్కర్‌, సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.