(Local) Mon, 16 Sep, 2019

స్వీటీ ‘నిశ్శబ్ధం’ ఫస్ట్ లుక్......

September 11, 2019,   3:39 PM IST
Views: 35
Share on:
స్వీటీ ‘నిశ్శబ్ధం’ ఫస్ట్ లుక్......

జేజెమ్మ గా తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న అనుష్క. లేడీ ఓరియంటెడ్ బాగమతి లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా స్వీటీ కథానాయికగా తమిళ హీరో ఆర్.మాధవన్ సరసన హేమంత్ మధుకర్ దర్శక‌త్వంలో "నిశ్శబ్ధం" లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో భారీస్థాయిలో విడుదల కానుంది. అనుష్క పాత్ర చిత్రణ మునుపెన్నడూ లేని విధంగా వైవిధ్యంగా ఉంటుందని  నిర్మాతలు తెలిపారు. ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్‌మ్యాడ్‌సన్, షాలినిపాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా అనుష్క ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు చిత్రయూనిట్. ఇందులో అనుష్క పెయింటింగ్ వేస్తున్న‌ట్టుగా ఉంది. టైటిల్‌కి సాక్షి.. మ్యూట్ ఆర్టిస్ట్ అనే క్యాప్ష‌న్ జ‌త చేశారు. అంటే అనుష్క సాక్షి పాత్ర‌లో మూగ‌మ్మయిగా క‌నిపిస్తుందా అనే అనుమానం అభిమానుల‌లో క‌లుగుతుంది. 

సంబంధిత వర్గం
నా దృష్టిలో అన్ని మ‌తాలు స‌మాన‌మే...మాధవన్
నా దృష్టిలో అన్ని మ‌తాలు స‌మాన‌మే...మాధవన్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.