(Local) Thu, 18 Jul, 2019

 “భీష్మ‌” లో నితిన్ లుక్ అదిరిపోయింది

July 11, 2019,   5:46 PM IST
Share on:

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థనిర్మిస్తున్న  “భీష్మ‌” ,ఈ చిత్రానికి వెంకీ కుడుముల‌ దర్శకత్వం, నితిన్ హీరో . తాజాగా ఈ సినిమాలోని నితిన్ లుక్ బయ‌ట‌కు వ‌చ్చింది. పెద్ద‌గా ప్ర‌యోగాల జోలికి వెళ్ల‌కుండా డీసెంట్ లుక్‌తో స్మార్ట్‌గా ఉన్న నితిన్ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ర‌ష్మిక మంద‌న్న ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. పెళ్లి అంటే ఇష్టం లేని ఓ కార్పొరేట్ ఉద్యోగి పాత్ర‌లో నితిన్ క‌నిపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కాగా.. దానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి, వెంకీ అట్లూరి సినిమాల‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.