(Local) Sat, 24 Aug, 2019

శరవణభవన్‌ అధినేత గుండెపోటుతో మృతి

July 18, 2019,   1:46 PM IST
Share on:

శరవణభవన్‌ అధినేత రాజగోపాల్‌(72) గుండెపోటుతో మృతి చెందాడు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. దోశకింగ్‌గా పేరుగాంచిన రాజగోపాల్‌ 1981లో చెన్నైలో తొలిసారి శరవణభవన్‌ను స్థాపించాడు. అనతి కాలంలోనే ఆయన వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగి విదేశాల్లోనూ తన హోటల్‌ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 
ఈ క్రమంలో తన వద్ద పనిచేస్తున్న వివాహితను పెళ్లాడితే తనకు మరింతగా కలిసివస్తుందని ఓ జ్యోతిష్యుడి సలహాతో ఆమె వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న రాజగోపాల్‌ ప్రతిపాదనను ఆమె అంగీకరించలేదు. దీంతో ఆమె భర్తను అడ్డు తొలగించుకుని ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో వివాహిత భర్తను కిరాయి గూండాలతో  హత్య చేయించాడు. ఈ కేసులో ఇటీవల రాజగోపాల్‌ను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు జీవిత శిక్ష విధించింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.