(Local) Fri, 13 Dec, 2019

కర్ణాటక జైళ్లలో పాక్‌, బంగ్లా చొరబాటుదారులు

November 16, 2019,   5:31 PM IST
Share on:
కర్ణాటక జైళ్లలో పాక్‌, బంగ్లా చొరబాటుదారులు

బంగ్లాదేశ్‌ పాకిస్థాన్‌ల నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడుతున్నవారు పశ్చిమబెంగాల్‌, దిల్లీ ముంబయి, చెన్నైలతోపాటు బెంగళూరుకు వచ్చి చేరుతున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో కర్టాటక రాష్ట్ర పోలీసులు పొరుగు దేశాల నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడిన వారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు. బెంగళూరులో తలదాచుకున్న బంగ్లాదేశీయులను కొద్ది రోజులుగా బంధించి, వారి దేశానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ నేర రికార్డుల కేంద్రం గణాంకాల ప్రకారం కర్ణాటకలోని వివిధ కారాగారాల్లో 6 మంది బంగ్లాదేశీయులు, నలుగురు పాక్‌ జాతీయులు విచారణ ఖైదీలుగా ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ, భవన నిర్మాణ కార్మికులుగా మరికొందరు తలదాచుకున్నారు. వీరిలో కొందరు దేశభద్రతకు ముప్పుగా ఉన్న తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమంగా తలదాచుకున్న విదేశీయుల ఉనికి తెలిస్తే స్టానిక పోలీసు ఠాణాల్లో ఫిర్యాదు చేయాలని నగర పోలీసు కమిషనర్‌ భాస్కరరావు కోరారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.