(Local) Fri, 19 Jul, 2019

పాకిస్థాన్ యాడ్ పై స్పందించిన నటి పూనమ్

June 15, 2019,   2:37 PM IST
Share on:

పూనమ్ పాండే పరిచయం అస్సలు అవసరం లేదు.  సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తనదైన స్టైల్ లో వార్తలో నిలుస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మడు తన బాల్కనీలో నిల్చొని తన ఫోన్లో ఒక యాడ్ కి సంబందించిన వీడియో చూపిస్తూ పాకిస్థాన్ కి తనదైన శైలిలో జవాబు ఇచ్చింది.  వివరాలలోకి వెళితే అభినంద‌న్ పాక్ ద‌ళాల‌కు చిక్కిన తర్వాత పాక్ అధికారులు ఆయ‌న్ను ప్ర‌శ్నించారు. టీ తాగుతూ అభినంద‌న్ పాక్ అధికారుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చాడు. అచ్చం అలాంటిదే అభినందన్ లాంటి స్టైల్ లో మీసాలు ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి ఓ యాడ్‌ను రూపొందించారు.  భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను అవమానిస్తూ పాక్‌ మీడియా రూపొందించిన యాడ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాడ్‌ ఇరు దేశాల మధ్య ఉన్న విద్వేషాన్ని మరింత రెచ్చగొట్టింది. ఇప్పటికే ఈ యాడ్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. భారత టెన్నిస్‌ స్టార్‌, పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ సతీమణి సానియా మీర్జా సైతం మండిపడింది. ఇక తాజాగా బాలీవుడ్ నటి పూనమ్‌ పాండే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది.  ఓ హీరో చేసిన పనిని వారు అపహాస్యం చేశారు. పాకిస్తాన్‌ ఇది మంచిది కాదు. ఈ యాడ్‌పై నా సమాధానం ఏంటంటే? అంటూ  టీ కప్పులపై సెటైర్లు ఎందుకు. వాస్తవానికి మీకు కావాల్సింది. ఈ కప్‌( తన లోదుస్తులు చూపిస్తూ) డబుల్‌ కప్‌ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఇక పూనమ్‌ చర్యపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆమె చేసిన పనిని మెచ్చుకోగా మరికొందరు తప్పుబడుతున్నారు.
 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.