(Local) Fri, 13 Dec, 2019

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కీలక పదవి

November 16, 2019,   5:26 PM IST
Share on:
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కీలక పదవి

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కీలక పదవినిచ్చారు. ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడుగా సీఎం కేసీఆర్ నియమించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను త్వరలో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశిచ్చారు. తంలో గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షుడిగా వ్యవహారించారు. ప్రస్తుతం ఆయన శాసనమండలి చైర్మన్ గా ఉన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారని అంతా భావించినా పరిస్థితుల దృష్ట్యా మంత్రి వర్గంలోకి తీసుకోలేదు. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి చూసుకుంటున్నారు. హుజుర్ నగర్ ఉప ఎన్నికలలో కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము కాకుండా గెలిపించారు. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి బహుమానంగా రైతు సమన్వయసమితి అధ్యక్ష పదవిని సీఎం కేసీఆర్ ఇచ్చారని టీఆర్ఎస్ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. త్వరలో రైతు సమన్వయ సమితి సభ్యుల నియామకం జరగనుంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. 

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.