(Local) Mon, 21 Oct, 2019

ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకొన్న సెలబ్రిటీస్....

September 17, 2019,   11:43 PM IST
Share on:
ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకొన్న సెలబ్రిటీస్... ...

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, పంజాబీ భామ ఛార్మి కలిసి తెరకెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పూరి, ఛార్మి ఇద్దరు ఇస్మార్ట్ శంకర్ హ్యాంగ్ ఓవర్ నుండి బయటకి వచ్చినట్టు లేరు. ఇక అదే కిక్ లో ఉన్నట్లు అర్ధం అవుతోంది.  ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అవ్వడంతో తన నెక్స్ట్ మూవీ విజయ్ దేవరకొండ తో చేస్తున్నాడు పూరి. ప్రస్తుతం లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నాడాయన. అలానే కేజీఎఫ్ హీరో యశ్.. డార్లింగ్ ప్రభాస్ తో కూడా సినిమాలని లైన్ పెట్టనున్నాడని వినికిడి. ఇది పక్కన పెడితే పూరి అండ్ ఛార్మి ఇద్దరు సడన్ గా రెండు కొత్త కార్ల తో దర్శనమిచ్చారు. ఎవరికి వారు విడివిడిగా ఖరీదైన లగ్జరీ కార్లతో ప్రత్యక్షమై షాకిచ్చారు. పూరి ఏమో రేంజ్ రోవర్ సిల్వర్ కలర్ దగ్గర నించుంటే ఛార్మి ఏమో వైట్ కలర్ బీఎండబ్ల్యూ 7 సిరీస్ దగ్గర నించుని ఫొటోస్ దిగారు. ఒకరికి ఒకరు కార్స్ ని గిఫ్ట్ గా ఇచ్చుకున్నట్టు తెలుస్తుంది. రెండు కార్లు దాదాపు కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ కి వచ్చిన ప్రాఫిట్స్ తో ఈ కార్స్ కొనుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వారు కార్ల తో దిగిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వర్గం
`రొమాంటిక్‌` మూవీ సెట్‌లో అగ్నిప్రమాదం...
`రొమాంటిక్‌` మూవీ సెట్‌లో అగ్నిప్రమాదం...
రౌడీ ని ఫిక్స్ చేసుకున్న డాషింగ్ డైరెక్టర్.....?
రౌడీ ని ఫిక్స్ చేసుకున్న డాషింగ్ డైరెక్టర్.....?

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.