(Local) Wed, 16 Oct, 2019

దర్శకేంద్రుడు మెచ్చిన 'ఎవ్వరికీ చెప్పొద్దు'..

October 09, 2019,   7:20 PM IST
Share on:
దర్శకేంద్రుడు మెచ్చిన 'ఎవ్వరికీ చెప్పొద్దు'..

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో బసవ శంకర్ దర్శకత్వంలో జోష్, వేదం, బద్రీనాధ్, మిర్చి, ‘బాహుబలి’ ‘ఎంసిఏ’, ‘జై లవ కుశ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు రాకేష్ వర్రే నిర్మాతగా, హీరోగా ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో  రాకేష్ వర్రే సరసన గార్గేయి ఎల్లాప్రగడ కథానాయికగా తెలుగు తెరకి పరిచయమైంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకోగా ఈ సినిమా దసరా కానుకగా నిర్మాత దిల్ రాజు ఈ మూవీని రిలీజ్ చేశారు. మార్నింగ్ షో నుండే మంచి టాక్ వచ్చింది. ప్రివ్యూ చూసిన సెలబ్రిటీలందరూ సినిమా చాలా బాగుందని ప్రశంసించారు.అయితే ఈ  సినిమా చూసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మూవీ టీమ్‌ని ఇంటికి పిలిచి అభినందించారు. తను ఈ జెనరేషన్ దర్శకుల దగ్గరినుండి నేర్చుకోవలసింది నేర్చుకుంటూనే.. వారి తగిన సలహాలు, సూచనలు ఇస్తాను అని చెప్పే దర్శకేంద్రుడు.. సినిమా బాగుంటే మేకర్స్‌ని పిలిపించి ప్రత్యేకంగా ప్రశంసిస్తారనే సంగతి తెలిసిందే. హీరో కమ్ నిర్మాత రాకేష్, దర్శకుడు బసవ శంకర్ ఇద్దరినీ ఆయన అభినందించారు. తెలుగు ప్రేక్షకులకు చక్కటి క్లీన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అందించారని.. రాకేష్ నటన నేచురల్‌గా ఉందని, కొత్తమ్మాయి గార్గేయి కూడా చాలా బాగా నటించిందని.. మరిన్ని మంచి సినిమాలు తీయాలని రాఘవేంద్రరావు వారిని బ్లెస్ చేశారు. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.