(Local) Fri, 15 Nov, 2019

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసి వివాదం

November 08, 2019,   2:15 PM IST
Share on:
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసి వివాదం

తెలంగాణ ఆర్టీసి పై హైకోర్టులో గురువారం విచారణ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో ఏపీ, తెలంగాణలకు షాకిచ్చేలా కేంద్రం తరపున లాయర్ తన వాదనలు వినిపించారు. అసలు ఏపీఎస్ఆర్టీసి విభజనే జరగలేదని కేంద్రం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు తన వాదనలు వినిపించారు. విభజన జరగనప్పుడు టీఎస్ ఆర్టీసిలో 33 శాతం వాటా ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. వాటా ఉంటే ఏపీఎస్ ఆర్టీసిలో ఉంటుందన్నారు. అసలు టీఎస్ ఆర్టీసికి చట్టబద్దతనే లేదన్నారు.

దీనికి ఏపీ, తెలంగాణ ఆర్టీసి అధికారులు స్పందించారు. విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని, విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ ఆర్టీసిని ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. విభజన అంశం పెండింగ్ లో ఉంటే కొత్త ఆర్టీసి ఎలా ఏర్పడిందని, అసలు రెండు రాష్ట్రాలు విభజన చేయాలని కేంద్రాన్ని కోరాలి కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
అయితే ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసి పరిణామాల పై ఏపీ సర్కార్ ఆరా తీస్తోంది. హైకోర్టులో కేంద్రం వాదనలు విన్న తర్వాత తమ ఆర్టీసి విలీనానికి ఏమైనా న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయా అనే కోణంలో ఏపీ సర్కార్ న్యాయనిపుణులతో ఇప్పటికే మాట్లాడినట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ ఆర్టీసి వివాదం ఇప్పుడు రెండు రాష్ట్రాల వివాదంగా మారింది. ఇది సీఎంలు కేసీఆర్, జగన్ లకు ఎదురు దెబ్బ అంటూ  ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

సంబంధిత వర్గం
అసదుద్దీన్ ఓవైసీపై మరో కేసు
అసదుద్దీన్ ఓవైసీపై మరో కేసు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.