(Local) Mon, 21 Oct, 2019

హిందీలో చెలరేగుతున్న 'సాహో'

September 17, 2019,   11:59 PM IST
Share on:
హిందీలో చెలరేగుతున్న 'సాహో'

యూవీ క్రియేషన్స్ లో సుజీత్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ నటించిన చిత్రం 'సాహో'.  ఈ  చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకువచ్చి తెలుగులో మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే  ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 424కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. అయితే హిందీలో ఈ చిత్రం రూ. 153 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళు సాధించిన‌ట్టు పోస్టర్ ద్వారా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. అత్యున్నత సాంకేతిక నిపుణులతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అంత‌గా అలరించ‌క‌పోయిన హిందీలో మాత్రం హ‌వా చూపిస్తుంది. బాహుబ‌లి చిత్రంతో ప్ర‌భాస్‌కి నేష‌న‌ల్ స్టార్‌డం రాగా, ఈ మూవీతో మ‌రింత పెరుగుతుంద‌ని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.
 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.