(Local) Wed, 16 Oct, 2019

నేడు ఆర్టీసి కార్మికుల భవిష్యత్ కార్యాచరణ ప్రకటన

October 09, 2019,   1:43 PM IST
Share on:
నేడు ఆర్టీసి కార్మికుల భవిష్యత్ కార్యాచరణ ప్రకటన

తెలంగాణలో ఆర్టీసి కార్మికుల సమ్మె 5 వ రోజు కొనసాగుతోంది. మరో వైపు ప్రయాణికులు ఇబ్బంది ఎదురుకోకుండా ప్రైవేటు బస్సుల ద్వారా ఆర్టీసి సేవలు అందిస్తోంది. ఆర్టీసిని ప్రభుత్వంలో కలపమని,కార్మిక సంఘాలతో చర్చలు కూడా జరపమని సీఎం కేసీఆర్ కరాకండిగా చెప్పారు. మరో వైపు ఉద్యోగులు వారంతట వారే తొలగిపోయారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆర్టీసి జేఏసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మికులు మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఆర్టీసి కార్మికులు నేడు తమ భవిష్యత్ కార్యాచరణను ఏ విధంగా ప్రకటించనున్నారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్టీసి కార్మికుల సమస్య సీఎం కేసీఆర్ కు సవాల్ గా మారిందని అంతా చర్చించుకుంటున్నారు.

సంబంధిత వర్గం
తెలంగాణాకు 79..,ఆంధ్రాకు 69 .346
తెలంగాణాకు 79..,ఆంధ్రాకు 69 .346

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.