(Local) Fri, 22 Nov, 2019

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు -గీతారెడ్డి

November 08, 2019,   3:10 PM IST
Share on:
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన కేంద్ర, రాష్ట్ర ...

కేంద్రం లోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వం అవలంబిస్తున్న నియంతృత్వ, ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం, మరియు సామాన్య ప్రజలకు అందవలసిన కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేకుండా పోయిందని  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి శ్రీమతి గీతారెడ్డి విమర్శించారు. రైతులకు కూడా ఎరువులు, విత్తనాలు సకాలంలో అందక పంటల దిగుబడి తగ్గి రైతులకు తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుందని ఆమె అన్నారు . వీటన్నిటినీ దృష్టి లో ఉంచుకుని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు పడుతున్న కష్టాలను, ఇబ్బందులను తెలియ జెయడానికీ ఈరోజు  అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ ఇచ్చిన పిలుపు మేరకు భారత దేశ వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా శుక్రవారం మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ను ముట్టడి చేసి కలెక్టర్ గారి దృష్టికి ప్రజలు పడుతున్న కష్టాలను తీసుకు  వచ్చి వారి ద్వారా ప్రభుత్వాలకు తెలియ జేయమని కోరడం జరిగిందని ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరి వర్ధన్  రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో  మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్  సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి,మేడ్చల్ మాజీ శాసన సభ్యులు కిచెన్నగారి లక్ష్మా రెడ్డి ,తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ వైస్ ఛైర్మన్  తోటకూర జంగయ్య యాదవ్ ,మల్కాజిగిరి నియోజకవర్గం ఇంచార్జ్  నందికంటి శ్రీధర్,  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.  అలాగే 9వ తేదిన ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తున్న మిలీనియం మార్చ్ కు మద్దతు తెలుపుతూ పార్టీకి చెందిన ప్రతిఒక్కరూ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయా నాయకులు పిలుపు నిచ్చారు. ఈ ముట్టడి కార్యక్రమం విజయవంతం చేసినందుకు హరి వర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వర్గం
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.