(Local) Fri, 19 Jul, 2019

చిరంజీవికి బర్తడే గిఫ్ట్ ఇవ్వనున్న సైరా టీమ్!

June 15, 2019,   1:47 PM IST
Share on:

రాయలసీమ విప్లవవీరుడు, తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు అయినా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా   రూపొందుతున్న మెగాస్టార్ 151వ సినిమా `సైరా నరసింహారెడ్డి'. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.  చిరంజీవి కెరీర్‌లోనే పిరియాడిక్ డ్రామా గా  అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ  చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ షూటింగ్‌లో భాగంగా లైవ్ లొకేషన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారట. కథలో అత్యంత కీలకమైన పార్ట్‌ను ఇక్కడ చిత్రీకరిస్తున్నారట. బ్రిటీష్ అధికారులకు, నరసింహారెడ్డికీ మధ్య జరిగే అతి కీలకమైన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కే సన్నివేశాలట ఇవి. వీటి కోసం ఆ కాలం నాటి బ్రిటీష్ బిల్డింగ్‌ల సెట్ వేయాల్సి ఉందట. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాండిచ్చేరిలో ఇంకా మిగిలి ఉన్న ఆ కాలం నాటి కొన్ని పురాతన భవనాల్లో ‘సైరా’ టీమ్ చిత్రీకరణ జరుపుతోందనీ వెల్లడి. `బాహుబలి` తరువాత ఆ స్పాన్ లో వస్తున్న సినిమా కావడం - ఇందులో బిగ్ బీ నటించడం వంటి కారణాలతో సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో `సైరా నరసింహారెడ్డి'. చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి ప్రేక్షకారధారణ ల‌భించింది. త్వ‌ర‌లో ఈ సినిమా ట్రైల‌ర్ కూడా విడుద‌లకి  సన్నాహాలు చేస్తున్నారు . మెగాస్టార్ చిరంజీవి జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్టు 22వ తేదీన `సైరా` ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌ల‌నుకుంటున్నార‌ట‌. అప్ప‌టి నుంచి చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను కూడా వేగ‌వంతం చేయ‌బోతున్నార‌ట‌.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.