(Local) Thu, 28 May, 2020

మాకు ఇంకా న్యాయం జరగలేదు.....

September 17, 2019,   5:17 PM IST
Share on:
మాకు ఇంకా న్యాయం జరగలేదు.....

కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం "సైరా నరసింహ రెడ్డి". ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా నటించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సైరా సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఉయ్యాలవాడ జీవిత కథని ఉయ్యాలవాడ ఫ్యామిలీ సభ్యుల ఆమోదంతోనే సినిమాని తెరకెక్కించారు. కాగా ఉయ్యాలవాడ ఫ్యామిలీ సైరా సినిమా తీసినందుకు గాను తమకు న్యాయం చెయ్యాలంటూ ఈ మధ్యన చిరు ఇంటిముందు, కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీస్ ముందు ఉయ్యాలా వాడ ఫ్యామిలీ ధర్నాలు చేసింది. అయితే ఈ సమస్యని రామ్ చరణ్ ఐదు కోట్లతో పరిష్కారం చేసినట్లుగా చెప్పారు. ఉయ్యాలవాడ వంశీకులు 22 మందికి మొత్తం 5 కోట్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇవ్వలేదు. ఆ తర్వాత ఏడు కుటుంబాలకి ఒక్కోదానికి రూ.15 లక్షలు చొప్పున ఇస్తామని అన్నారు. అది కూడా ఇవ్వలేదు. ముందు రాసిన నోటరీ విషయం ఏమి అయ్యిందో, మొన్న ఇచ్చిన మాట ఏమి అయ్యిందో మాకు అర్ధం కాలేదు. అందుకే మేము రామ్ చరణ్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామని ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా చేయించుకున్నరట. కానీ ఇప్పటివరకు తమకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని తమకు న్యాయం కూడా జరగలేదని ఉయ్యాలవాడ ఫ్యామిలీ మళ్ళీ నేడు కొణిదెల ఆఫీస్ ముందు ధర్నాకి దిగగా బంజారాహిల్స్ పోలీసులు ఉయ్యాలవాడ ఫ్యామిలీ సభ్యులని పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంతో ఉయ్యాలవాడ ఫ్యామిలీ సభ్యులు సైరా టీం మీద తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.