(Local) Sat, 24 Aug, 2019

'సూపర్ 30' చిత్రాన్ని వీక్షించిన వెంకయ్య దంపతులు!

July 18, 2019,   3:14 PM IST
Share on:

కాబిల్ తర్వాత హృతిక్ రోషన్ నటించిన 'సూపర్ 30' సినిమా జులై 12న విడుదలైంది.  బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని సందడి చేస్తోంది. అయితే ఈ చిత్రాన్ని కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా  తాజాగా ఈ చిత్రాన్ని భార‌త ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన కుటుంబంతో కలసి వీక్షించారు. వెంకయ్య దంపతుల కోసం ఉపరాష్ట్రపతి భవన్ లో ప్రత్యేకంగా చిత్రాన్ని ప్రదర్శించారు. వంద‌లాది పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం క‌ల‌లు క‌న్న ఉపాధ్యాయుడి జీవితాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన నిర్మాత‌ల‌కి శుభాకాంక్ష‌లు తెలుపుతూ హృతిక్‌తో పాటు ప‌లువురు న‌టీన‌టుల న‌ట‌న కూడా కొనియాడారు. సూప‌ర్ 30 పేరిట కోచింగ్ సెంట‌ర్‌ని ప్రారంభించిన ఆనంద్‌ని కూడా అభినందిస్తున్నాను అంటూ వెంక‌య్య నాడు త‌న ట్విట్ట‌ర్ ద్వార తెలిపారు. అలానే చిత్ర బృందంతో క‌లిసి దిగిన ఫోటోలు కూడా షేర్ చేశారు. ప్రముఖ గణిత ప్రొఫెస‌ర్‌ ఆనంద్‌ కుమార్ జీవిత నేప‌థ్యంలో సూప‌ర్ 30 చిత్రం తెర‌కెక్క‌గా ఈ చిత్రానికి వికాస్ బెహెల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నడియాద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌, టీవీ నటుడు నందిష్‌ సింగ్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.