(Local) Fri, 15 Nov, 2019

జఠిలంగా మారిన విజయారెడ్డి హత్య కేసు

November 08, 2019,   3:06 PM IST
Share on:
జఠిలంగా మారిన విజయారెడ్డి హత్య కేసు

అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి పై దాడి చేసిన నిందితుడు సురేష్ చికిత్స పొందుతూ గురువారం మరణించిన  విషయం తెలిసిందే . ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సురేష్ మృతి చెందడంతో ఈ కేసు ఇప్పుడు జఠిలంగా మారింది. సురేష్ మరణంతో ఆయన వాంగ్మూలం, ఫోన్ కీలకంగా మారింది. 4వ తేదిన సురేష్ ఎమ్మార్వో పై దాడి తర్వాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఆ తర్వాత అతనిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

అక్కడ పోలీసులు లేకుండానే మేజిస్ట్రేట్ సురేష్ వాంగ్మూలం తీసుకున్నారు. అందులో భూమి కోసం తిరిగి తిరిగి అలిసిపోయే ఈ పని చేశానని సురేష్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే సురేష్ వాంగ్మూలాన్ని తమకు అందించాలని సీపీ మేజిస్ట్రేట్ ను కోరారు. సురేష్ సోమవారం సాయంత్రం వరకు చూడగలిగారు. మాట్లాడగలిగారు. ఆ తర్వాత అతను స్పందించలేదు. చూపు కోల్పోయాడు. సెమీ కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు అతని వాంగ్మూలాన్ని సేకరించలేకపోయారు. 

ఈ కేసులో వ్యక్తమవుతున్న అనుమానాలు 

- సురేష్ ఎమ్మార్వో ఆఫీసుకు రావడానికి ముందు ఆఫీసుకు ముందు ఉన్న వైన్స్ దగ్గర ఆగి ఉన్న కారు దగ్గర ఉన్న వారితో మాట్లాడి వచ్చాడు. 

- కారులో ఉన్న వ్యక్తులతో మాట్లాడిన తర్వాతే సురేష్ తన ప్లాన్ మార్చుకున్నాడా.

- కేవలం ఎమ్మార్వోని మాత్రమే చంపాలనుకున్న సురేష్ కి ప్రమాదవశాత్తు  మంటలు అంటుకున్నాయా

- మంటలు అంటుకున్న తర్వాత బయటికి వచ్చి నేరుగా వైన్స్ దగ్గర ఉన్న కారు దగ్గరకే సురేష్ వెళ్లాడు. వారి సూచన మేరకే పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడా.

- 65 శాతం కాలిన గాయాలు కావడంతో తప్పనిసరి పరిస్థితిలోనే లొంగిపోయాడా. గాయాలు కాకపోతే వైన్స్ దగ్గర ఉన్న కారులోనే పారిపోవాలని చూశాడా. 

- వైన్స్ దగ్గర ఉన్న కారు ఎటు వైపు వెళ్లింది. అసలు అందులో ఎవరు ఉన్నారు. 

- సురేష్ గ్రామం గౌరెల్లి నుంచి ఎమ్మార్వో ఆఫీసుకు 8 కిలో మీటర్లు. ఆటోలు, బస్సులు సమయానికి అందుబాటులో ఉండవు. సురేష్ కారులోనే వచ్చాడా. 

- కారులో వచ్చేటప్పుడే పెట్రోల్ డబ్బాతో వచ్చాడా

- బంక్ లో పెట్రోల్ తీసుకువస్తే కేవలం పెట్రోల్ మాత్రమే ఉండాలి. కానీ అందులో కిరోసిన్ కూడా కలిసి ఉండడంతో ప్లాన్ ప్రకారమే వచ్చాడా. 

ఇలా పలు రకాలైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీపీ జయరాం విచారణ అధికారిగా 4 బృందాలతో ఈ కేసును విచారిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. సురేష్ చనిపోయినా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని సీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు.

సంబంధిత వర్గం
నేను ఇప్పటికి ఇంగ్లిష్ తో కుస్తీపడుతున్న - పుష్పా  ...
నేను ఇప్పటికి ఇంగ్లిష్ తో కుస్తీపడుతున్న - పుష్పా ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.