(Local) Sun, 12 Jul, 2020

న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...

November 29, 2019,   3:03 PM IST
Share on:
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...

నిందితుడికి బెయిల్ మంజూరు చేయనందుకు ఒక మహిళా మెజిస్ట్రేట్‌ను బెదిరించిన 12 మంది న్యాయవాదులపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మెజిస్ట్రేట్ ఛాంబర్ తలుపులు మూసి ఆమెను వారు బెదిరించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే రవాణా సంస్థకు చెందిన బస్సు డ్రైవర్ ఒకరికి బెయిల్ మంజూరు చేయడానికి కేరళ రాజధాని తిరువనంతపురంలోని జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దీపా మోహన్ నిరాకరించారు. దీంతో ఆ 12 మంది న్యాయవాదులు ఆమె ఛాంబర్‌లోకి చొరబడి బెయిల్ ఇవ్వకపోతే చావగొడతామని బెదిరించారు. ఆడదానివైపోయావు..లేకుంటే నిన్ను ఛాంబర్‌లోనుంచి బయటకు ఈడ్చుకొచ్చి తన్నేవాళ్లం అంటూ న్యాయవాదులు తనను బెదిరించారని దీపా మోహన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 12 మంది నిందితులలో తిరువనంతపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి కూడా ఉన్నారు.

మహిళా మెజిస్ట్రేట్‌ను న్యాయవాదులు బెదిరించారన్న సమాచారం అందడంతో కేరళ హైకోర్టు కల్పించుకుని ఈ సంఘటనపై వెంటనే కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించింది. న్యాయవాదులు మహిళా మెజిస్ట్రేట్ దీపా మోహన్ పట్ల వ్యవహరించిన తీరుపై కేరళ జుడిషియల్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఒక లేఖ రాసింది. ఈ సంఘటన నవంబర్ 27న జరిగింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.