(Local) Wed, 16 Oct, 2019

ఆడ పులిపిల్ల మృతి...

October 09, 2019,   12:04 PM IST
Share on:
ఆడ పులిపిల్ల మృతి...

మహారాష్ట్ర  సరిహద్దులో పెను గంగా నది అవతలి ఒడ్డున అనుమానస్పదంగా పులి మృతి చెందింది. తడోబా అభయారణ్యాల కోర్‌ జోన్‌ (పులుల సంరక్షణ ప్రదేశం) పాండరపౌనీ పంచధార పరిసరాల్లో సమీపంలో పులి మృతి దేహం కనిపించడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ ఉన్నాతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.  అనంతరం పులికి పంచానామ నిర్వహించారు. ఇది ఆడ పులిపిల్ల అని.. దీని పేరు మీరా.. వయస్సు రెండేళ్లుగా గుర్తించారు.పులి కళేబరాన్ని పరిశీలించగా మెడపై బలమైన గాయాలున్నాయని తెలిపారు. ఇతర జంతువులతో పోరాడి మృతి చెంది ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తుండగా.. వేటగాళ్ల దాడికి బలై ఉంటుందని వన్యప్రాణి ప్రేమికులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వర్గం
జమ్మూ, లడఖ్ ప్రాంతాలు దేశానికి మణిమకుటాలు : మోదీ
జమ్మూ, లడఖ్ ప్రాంతాలు దేశానికి మణిమకుటాలు : మోదీ
శివసేన అభ్యర్థిని సీఎం చేస్తానని మాటిచ్చా: ఉద్దవ్  ...
శివసేన అభ్యర్థిని సీఎం చేస్తానని మాటిచ్చా: ఉద్దవ్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.