(Local) Fri, 15 Nov, 2019

భారత సైన్యం దాడుల్లో 10 మంది పాక్‌ సైనికులు హతం

October 21, 2019,   4:56 PM IST
Share on:
భారత సైన్యం దాడుల్లో 10 మంది పాక్‌ సైనికులు హతం

భారత్ పాక్ సరిహద్దులో ఆదివారం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైనికాధిపతి బిపిన్‌ రావత్‌  మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడుల్లో 6 నుంచి 10 మంది పాక్‌ సైనికులు మృతి చెంది ఉంటారని తెలిపారు. ఉగ్రవాదులు కూడా దాదాపు అదే స్థాయిలో హతమార్చినట్లుగా ఆయన తెలిపారు. ఈ మేరకు రావత్‌ మాట్లాడుతూ... నీలం వ్యాలీలో లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులకు చెందిన నాలుగు స్టావరాలు లక్ష్యంగా భారత్‌ దాడులు చేసిందని, అందులో మూడు స్టావరాలు పూర్తిగా ధ్వంసం కాగా మరొకటి స్వల్పంగా ధ్వంసమైందని తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌కు ఫోన్‌ చేసి తాంగ్ధర్‌ సెక్టార్‌లో ప్రస్తుత పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారని సమాచారం.

సంబంధిత వర్గం
హెచ్‌టీటీ-40 విమానయానం అద్భుతం
హెచ్‌టీటీ-40 విమానయానం అద్భుతం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.