(Local) Thu, 28 May, 2020

అసదుద్దీన్ ఒవైసీ డ్యాన్స్ - సోషల్ మీడియాలో వీడియో వైరల్

October 19, 2019,   1:34 PM IST
Share on:
అసదుద్దీన్ ఒవైసీ డ్యాన్స్ - సోషల్ మీడియాలో  వీడియో ...

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఔరంగాబాద్‌లోని పైథాన్ గేట్ వద్ద ఎంఐఎం పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రచారం ముగిసిన తర్వాత స్టేజీ మీది నుంచి కిందికి దిగుతూ డ్యాన్స్ స్టెప్పులు వేశారు ఒవైసీ.  పార్టీ గుర్తు గాలిపటం ఎగరేస్తున్నట్టుగా స్టెప్స్ వేస్తూ కార్యకర్తలను  ఆశ్చర్యంలో ముంచెత్తారు.

శుక్రవారం జరిగిన ఈ ర్యాలీలో ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలోనే ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. దీంతో అర్‌ఎస్ఎస్, మతవాదులకు సంకేతాలు ఇస్తారు. ఇంగ్లీష్‌లో దీన్ని ‘డాగ్ విజిల్ పాలిటిక్స్’ అంటారు.’’ అంటూ అసదుద్దీన్ ఫైర్ అయ్యారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకు గానూ ఎంఐఎం 44 చోట్ల తమ పార్టీఅభ్యర్థులను బరిలోకి నిలిపింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.