(Local) Thu, 18 Jul, 2019

అయోధ్య కేసులో మధ్యవర్తుల రిపోర్టు పరిష్కారం చూపించాలి

July 11, 2019,   2:48 PM IST
Share on:

అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. అయోధ్య కేసులో మధ్యవర్తుల రిపోర్టు అందే వరకు వేచి చూడక తప్పదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. పూర్తి నివేదికను అందివ్వాలని మధ్యవర్తులను ఆదేశించింది. ఈ నెల 18 వరకు గడువు విధించింది. ఈ కేసులో ఓ మధ్యవర్తుల కమిటీని ఏర్పాటు చేశామని.. వాళ్లు ఇచ్చే రిపోర్టు కోసం వేచి చూడాల్సి ఉంటుందని వాదనల సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ ఆ నివేదికలో మధ్యవర్తిత్వ కమిటీ సామరస్య పరిష్కారం చూపించకపోతే జులై 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి వాదనలను ఈ నెల 25కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.